MNCL: బెల్లంపల్లి పట్టణంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులకు రూరల్ CI అఫ్జలుద్దీన్ శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. బంగారు మైసమ్మ ఆలయం పరిసరాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించినట్లు CI తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యువత గంజాయి, మద్యం వంటి చెడు అలవాట్లకు లోను కాకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.