జైపూర్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో సంచలన విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. జైస్వాల్ (74) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ (34), రియాన్ పరాగ్ (39) రాణించినా విజయం అందించలేకపోయారు. LSG బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3 వికెట్లు తీశాడు.