సత్యసాయి: సోమందేపల్లిలో హంద్రీనీవా కాలువకు పడిన గండిని తక్షణమే పూడ్చాలని మంత్రి సవిత నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె అధికారులు, నాయకులతో కలిసి గండిని పరిశీలించారు. అధికారులు మాట్లాడుతూ.. గండి పడిన వెంటనే నీటి సరఫరాను నిలిపివేశామని మంత్రికి తెలిపారు. ప్రస్తుతం గండి పూడ్చివేత పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.