TPT: కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ సోమవారం ఏర్పేడు గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మాజీ ఛైర్మన్ బత్తల గిరి నాయుడు, ఈవో రామచంద్రారెడ్డి వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. దంపతులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం పొందారు.