ATP: టీడీపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని పార్టీ శ్రేణులకు MLA కాల్వ శ్రీనివాసులు సూచించారు. నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. మండల స్థాయి కమిటీలను త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.