ప్రకాశం: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఒంగోలు ప్రకాశం భవన్లో సోమవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధిపై అధికారయంత్రాంగం దృష్టి పెట్టాలన్నారు. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కల్పనపై చర్చించారు.