సత్యసాయి: రాప్తాడు నియోజకవర్గం ఉప్పరపల్లి గ్రామంలో శ్రీ పాలవేరు వీరనాగమ్మ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎద్దుల పోటీల కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. స్వయంగా కొద్ది దూరం ఎద్దులను తొలి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.