పాకిస్తాన్ తదుపరి చర్యలపై ఓ కన్నేసి ఉంచామని ప్రధాని మోదీ అన్నారు. పాక్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ చేస్తే సహించేది లేదన్నారు. ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలో భారత్కు తెలుసన్నారు. పాకిస్తాన్ తోక జాడిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. భారత్ ఇప్పుడు కొత్త యుద్ధరీతుల్ని అమలుచేస్తోందన్నారు. మేడిన్ ఇండియా అస్త్రాలు వాడే సమయం వచ్చిందన్నారు.