SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం పంచాయతీ రాజ్ శాఖ, ICDS అధికారులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణాలు, వాటి స్థితిగతులు వంటి అంశాల పై చర్చించారు. ఈ మేరకు వాటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.