SDPT: సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మెరుగైన ఉత్తీర్ణత శాతం పెంచేలా పనిచేయాలని అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్లో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల ప్రిన్సిపల్స్, ఆయా శాఖల వెల్ఫేర్ అధికారులతో సమీక్షా నిర్వహించారు.