TPT: తిరుపతి నగరంలో గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా పల్లి వీధిలో వెలసిన వేశాలమ్మకు రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్ద ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పోరేషన్ చైర్మన్ నరసింహా యాదవ్ పాల్గొన్నారు.