ప్రకాశం: వీవోఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హనుమంతునిపాడు మండలం వీవోఏల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మండల ఏపీఎం రజనీకుమారికి సమ్మె నోటీసు అందజేశారు. వీవోఏ సంఘం మండల అధ్యక్షులు రాణి మాట్లాడుతూ.. వెలుగు వీవోఏల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ జరుగుతున్న సమ్మెకు వీవోఏలు పాల్గొనాలన్నారు.