SRD: సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్లో బుద్ధ జయంతి వేడుకలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రామారావు మాట్లాడుతూ.. బుద్ధుడు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కోటయ్య, నాగయ్య, మొగులయ్య, సుధాకర్, దుర్గాప్రసాద్, అశోక్, రవీందర్, ప్రభాకర్, బసవరాజ్, హరికృష్ణ పాల్గొన్నారు.