GNTR: ఏపీ ఎడ్సెట్ 2025కు మే 14తో దరఖాస్తుల గడువు ముగియనున్నట్టు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కన్వీనర్ ఏవీఎస్ స్వామి సోమవారం తెలిపారు. వాయిదా రుసుములతో మే 27 నుంచి జూన్ 3 వరకు అప్లై చేయవచ్చన్నారు. హాల్టికెట్లు మే 30 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, జూన్ 5న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.