TPT: ఎర్రావారిపాళ్యం మండల పరిధిలోని కూరపర్తివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ ఆరేటమ్మ తల్లి మొలకల పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు చేశారు.