TG: HYD కొండాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హఫీజ్పేట్ సర్వే నంబర్ 79లోని భూములపై వివాదం జరిగింది. 20 ఎకరాల్లోని కట్టడాలను కూల్చివేస్తుంది. TDP MLA వసంతకృష్ణప్రసాద్కు చెందిన.. రూ.2 వేల కోట్ల విలువైన స్థలంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. వసంత హౌస్ సంస్థ కార్యాలయం, షెడ్లు కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.