ప్రకాశం: జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు చీమకుర్తికి చెందిన ఓ క్రీడాకారుడు ఎంపికయ్యాడు. చీమకుర్తి పట్టణానికి చెందిన శ్రీహరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న అండర్ -17 జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. కోచ్ ఉమామహేశ్వరరావు శనివారం శ్రీహరిని అభినందించారు. అలాగే పలువురు శ్రీహరిని అభినందించారు.