SRD: జిల్లాలో 95, 687 ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందులో దొడ్డు ధాన్యం 88,033 ఎకరాల్లో, సన్న ధాన్యం 7, 654 ఎకరాల్లో సాగు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 218 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.