ADB: గాదిగూడ మండలం కొలమ గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు వైపు దృష్టిసారించాలన్నారు. గంజాయి, సైబర్ క్రైమ్ పట్ల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం గ్రామ యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు.