కృష్ణా: విజయవాడలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కృష్ణలంక పోలీసుల వివరాల మేరకు.. బందరు కాలువలో వీఎంసీ గేట్ వద్ద ఆదివారం గుర్తుతెలియని మృతదేహం ఉందన్న సమాచారం మేరకు పరిశీలించామన్నారు. ఈ క్రమంలో అతని వయసు 40 నుంచి 45 సంవత్సరం మధ్య వయసు ఉంటుందన్నారు. మృతుడు 5 అడుగులు ఉన్నాడని, గోధుమ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడన్నారు.