కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారు లంకలో డంపింగ్ యార్డ్‌కు పది నుంచి 15 ఎకరాల భూమిని సమీకరించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలిపారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన బండారులంకకు చెందిన నల్ల ఈశ్వరికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రూ.50,800 చెక్కును గురువారం ఎమ్మెల్యే అందజేశారు.