HYD: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే తెలంగాణ బోనాల ఉత్సవాలకు సంబంధించి గోల్కొండ కోటలో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. గురువారం దేవాలయం వద్ద బారీకేడ్ల పనులు మొదలుపెట్టారు. దేవాలయ కమిటీ ఛైర్మన్ చంటిబాబుతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత పనులను పర్యవేక్షించారు. బారీకేడ్లను పటిష్టంగా అమర్చాలని కార్మికులకు చంటిబాబు సూచించారు.