NRML: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కొరకు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, DEO రామారావుకు గురువారం కలెక్టరేట్లో యోగ మ్యాట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.