SRD: కస్తూర్బా పాఠశాలలో చదివే బాలికలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కొండాపూర్ మండల విద్యాధికారి దశరథ్ అన్నారు. కొండాపూర్ కస్తూర్బా పాఠశాలలో బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారని చెప్పారు. అనంతరం పదవ తరగతి బాలికతో మాట్లాడి బాగా చదువుకోవాలని సూచించారు.