ATP: బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు పశువైద్య అధికారిగా గోవిందరాజులు గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన నార్పల మండలం పశు వైద్య అధికారిగా విధులు నిర్వహించి బదిలీ నిమిత్తం కొర్రపాడుకు వచ్చారు. పాడి రైతులకు అనునిత్యం అందుబాటులో ఉండి, తన వంతు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.