ప్రకాశం: దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను అవమానించిన ఎమ్మెల్యే పార్థసారథిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మోహన్ కనిగిరిలో ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆదోని మండలం దానాపురంలో కూటమి ఏడాది సంబరాల్లో దళిత సర్పంచ్ చంద్రశేఖర్‌ను కుల ప్రస్తావన తెచ్చి అవమానించడం బాధాకరమని మోహన్ అన్నారు.