మధ్యప్రదేశ్లో బోరుబావిలో పడిన బాలుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గుణ జిల్లాలో సుమిత్ మీనా అనే బాలుడు ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. అది గమనించిన కుటుంబసభ్యులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు 16 గంటలు శ్రమించి బాలుడిని కాపాడారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు తెలిపారు.