KDP: కొండాపురం మండలం వెంకటాపురం గ్రామం వద్ద కారు-స్కూటర్ ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారుకొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి చెందిన అశోక్ (18), అనంతపురం జిల్లా సూరేపల్లి గ్రామానికి చెందిన రాము(33), ప్రణయ్(10)గా స్థానికులు తెలిపారు. వీరిలో అశోక్‌కు కాలు, చేయి విరిగింది. ప్రణయ్, రాములకి కాలు విరిగి గాయాలైనట్లు సమాచారం.