NLR: గూడూరు పరిధిలోని కొత్త కోడూరు బీచ్ రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ట్రాన్స్ ఫార్మర్ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా దెబ్బతింది. దీంతో సమీప పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.