ASR: కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద 172.310 కేజీల గంజాయి పట్టుబడిందని సీఐ పీ.వెంకటరమణ బుధవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో ఎస్సై పీ.కిషోర్ వర్మ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా, ఆటోలో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈ మేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
NDL: డోన్ పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధి గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం తెల్లవారుజామున కలకలం రేపింది. ప్రయాణికులు స్థానికులు మృతదేహాన్ని గమనించి రైల్వే పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆయన వయసు 50 ఏళ్లు ఉండొచ్చు అని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SKLM: నరసన్నపేట మండలం లుకలాంలో చింత చెట్టుపై నుంచి జారి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతి చెందాడు. బొత్స శ్రీరాములు (52) మంగళవారం చింత చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కింద పడ్డాడు. స్థానికులు గమనించి నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. మంగళవారం పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనర్ బాలికను ప్రేమిస్తున్నాడని ఈ నెల 3వ తేదీ ప్రేమికుడిని కొట్టి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడి చేసి వృద్ధురాలిని హత్య చేశారని తెలిపారు.
GNTR: పొన్నూరు నిడుబ్రోలు వద్ద విషాదం జరిగింది. భార్య మృతిని తట్టుకోలేక గుండెపోటుతో భర్త మరణించిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. మాజీ ఆర్మీ ఉద్యోగి అన్నవరపు ఆశీర్వాదం(85), భార్య సామ్రాజ్యం(76) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారు. సోమవారం రాత్రి సామ్రాజ్యం మృతిచెందగా, ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆశీర్వాదం మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.
KDP: మైదుకూరు మండలం వనిపెంట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న సంఘటన లో తీవ్ర గాయాలైన యువకుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బంధువులు కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తన కుమారుడు మృతి చెందడంపై తల్లిదండ్రులు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు.
కృష్ణా: అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబాబా గుడి పక్కన మలుపులో ఉన్న చెత్త నుంచి మంగళవారం భారీగా మంటలు చెలరేగాయి. చెట్లకు మంటలు అంటుకోవటంతో స్థానికులు సర్పంచ్ దాసరి విజయ్ కుమార్‌కు సమాచారం అందించారు. అవనిగడ్డ ఫైర్ సిబ్బందికి విషయం తెలపటంతో వారు వచ్చి మంటలు ఆదుపు చేశారు.
HYD: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్టులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జేయియి మెయిన్స్ రెండో సెషన్ పూర్తికావొచ్చింది. TGEAPCET(చివరి తేదీ ఏప్రీల్ 9), APEAPCET ( ఏప్రీల్ 24) ప్రక్రియ కొనసాగుతోంది.
NTR: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొండపల్లికి చెందిన ఓ బాలిక(5)పై మతిస్థిమితం లేని వ్యక్తి(42) అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
PLD: వినుకొండ మండలం నడిగడ్డ గ్రామంలో ఆదివారం పండుగ రోజు విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే నలుగురు బాలురు కలిసి బహిర్భూమికి వెళ్లారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు (16) అనే బాలుడు చెరువులో ఉన్న తామర పువ్వు తీసేందుకు దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో ఊపిరి ఆడక మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.
ప్రకాశం: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. కొండపి మండలం ఉప్పలపాడులో పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉంటున్న సాదు వెంకటకోటయ్య బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
SRPT: రోడ్డు ప్రమాదంలో శనివారం పిల్లలమర్రి గ్రామానికి చెందిన దాసరి విజిత(23) మృతి చెందింది. సూర్యాపేట మండలం రాయినిగూడెం సమీపంలో 7 ఆర్ హోటల్‌లో పని చేస్తున్న విజిత విధులకు వెళ్తూ హోటల్ దగ్గర రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి సూర్యాపేట వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టగా అక్కడిక్కడే మృతి చెందింది.
NLR: రాపూరు మండలంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు గ్రామం వద్ద ఆటో-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడిని జోరోపల్లికి చెందిన వల్లూరు జగదీశ్‌గా స్థానికులు గుర్తించారు.
AP: చిత్తూరులోని వెంకటగిరికోటలో 3.7 కిలోల బంగారం దోపిడీ జరిగింది. తమిళనాడులోని వేలూరు నుంచి కర్నాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా దుండగులు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కారును అడ్డగించి కత్తులు చూపించి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
HYD: రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు వెటర్నరీ కాలేజీలో కార్మికుడిగా పనిచేస్తున్న యూసఫ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల ప్రకారం.. బుద్వేల్ బస్తీలో ఉంటున్న యూసఫ్ కొన్నేళ్లుగా వెటర్నరీ కాలేజీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే విధులకు వచ్చిన అతడు కాలేజీ ఆవరణలో గేటుకు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.