• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బ్రేకింగ్ న్యూస్

రూ.3కోట్ల డ్రగ్స్ స్వాధీనం

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కిలో MDMA డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.3కోట్లు ఉంటుందని వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

December 21, 2024 / 11:14 AM IST

BREAKING: రాష్ట్రంలో మరోసారి భూకంపం

AP: రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పు కంభంపాడు, శంకరాపురంలో భూమి కంపించింది. దీంతో ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. తాళ్లూరు మండలంలోని గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది.

December 21, 2024 / 11:02 AM IST

పాము కాటుతో బాలుడు మృతి

ASR: మట్లపాడుకు చెందిన మొరం సాయి దొర (6) అనే ఆరేళ్ల బాలుడు పాముకాటుకి గురై శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆరుబయట ఆడుకుంటున్న బాలుడికి పాముకాటుకు గురై శరీరం రంగు మారుతుండటంతో బాలుడు తండ్రి తమన్న దొర ఎల్లవరం పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అడ్డతీగల సీహెచ్‌సీ వైద్యులకు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

December 21, 2024 / 10:32 AM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యాపారి దుర్మరణం

W.G: తణుకు జాతీయ రహదారిపై డిమార్ట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన కూరగాయల వ్యాపారి అడ్డగర్ల సుబ్రహ్మణ్యం (45) మోటార్ సైకిల్‌పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 21, 2024 / 10:17 AM IST

బాలికల అక్రమ రవాణా గుర్తించిన రైల్వే పోలీసులు

AP: విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు అయింది. కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమ రవాణాను పోలీసులు గుర్తించారు. మొత్తం 11 మందిని రైల్వే పోలీసులు కాపాడినట్లు తెలుస్తోంది. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మారుమూల ప్రాంతాల నుంచి బాలికల అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 100 మందికి పైగా బాలికలను అక్రమ రవా...

December 21, 2024 / 09:42 AM IST

కరెంట్ షాక్‌తో 9వ తరగతి విద్యార్థి మృతి

WNP: వనపర్తి మండలం పెద్దగూడెం తిరుమలయ్య గుట్ట సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి హరీష్ కుమార్ (14) శనివారం తెల్లవారుజామున 6 గంటలకు విద్యుత్ షాక్‌తో మరణించాడు. పాఠశాల సమీపంలోని వేరుశనగ చేనుకు పెట్టిన విద్యుత్ కంచ తగిలి చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు తెలుస్తోంది.

December 21, 2024 / 09:36 AM IST

రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

W.G: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన శనివారం తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సుమారు 70 సంవత్సరాలు వయస్సు కలిగిన వృద్ధురాలు రైలు పట్టాల సమీపంలో చనిపోయి ఉండడంతో గుర్తించిన స్థానికులు.. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు ఆమె ఆచూకీ కోసం వివరాలు సేకరిస్తున్నారు.

December 21, 2024 / 09:30 AM IST

ఆన్ లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి

RR: మహేశ్వరం మండలం కేంద్రంలో ఆన్ లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. మహేశ్వరం సీఐ తెలిపిన వివరాలు.. పోచమ్మ బస్తీకి చెందిన ఎదిరే సాయి కిరణ్ (21) నారాయణగూడ ఓ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోగా ఆస్పత్రిలో చికిత్స పొందుతు చనిపోయారు.

December 21, 2024 / 09:16 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. 60 మందికి గాయాలు

జర్మనీలోని మాగ్డేబర్గ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రిస్మస్ మార్కెట్‌లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరి మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారులో పేలుడ పదార్థం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

December 21, 2024 / 08:50 AM IST

టెర్రరిస్ట్ అటాక్.. 60 మందికి గాయాలు

జర్మనీలోని మాగ్డేబర్గ్‌లో టెర్రరిస్ట్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. క్రిస్మస్ మార్కెట్‌లోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా ఇద్దరి మృతి చెందారు. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కెట్‌లోకి దూసుకెళ్లిన కారులో పేలుడు పదార్థం ఉన్నట్లు అక్కడి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

December 21, 2024 / 08:50 AM IST

కారు, బైక్ ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ASR: ఎటపాక మండలం రాయన్నపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుని కాలు పూర్తిగా తెగిపోయింది. గుర్తుతెలియని ఆ వ్యక్తి శరీరం నుంచి కాలు వేరుపడటం వల్ల తీవ్రంగా రక్తస్రావమై రోడ్డుపై విలవిల్లాడాడు. సమీపంలోని కొంతమంది ప్రజలు గమనించి, చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు.

December 21, 2024 / 08:30 AM IST

చెక్ బౌన్స్ కేసులో వ్యక్తికి ఆరు నెలలు జైలు శిక్ష

SKLM: శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పరిధిలో చెక్ బౌన్స్ కేసులో ఓ నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష విధించినట్లు పలాస సివిల్ కోర్టు జడ్జి యు. మాధురి వెల్లడించారు. ఈ మేరకు వివరాలు ప్రకారం.. బకాయి నిమిత్తం శ్రీరామ్ చిట్స్ బ్రాంచ్‌లో శ్రీధర్ అనే యువకుడు రూ. 1,4700 చెక్కు ఇచ్చాడు. ఈ చెక్ తీసుకొని యాజమాన్యం బ్యాంకుకు వెళ్లగా.. చెక్ బౌన్స్ అయిందని వెల్లడైంది.

December 21, 2024 / 08:05 AM IST

కడుపునొప్పి తాళలేక ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

VZM: కడుపునొప్పి తాళలేక ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జామిలో శుక్రవారం చోటుచేసుకుంది. జామి మండల కేంద్రంలో స్థానిక గొర్లెవీధికి చెందిన సిహెచ్. రవి (32) కొంతకాలం నుండి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఎస్సై వీర జనార్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 21, 2024 / 08:05 AM IST

భారీ అగ్నిప్రమాదం

HYD: మాదాపూర్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇనార్బిట్‌మాల్ సమీపంలోని సత్య భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడినట్లు, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 21, 2024 / 07:44 AM IST

BREAKING: సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇనార్బిట్ భవనం ఎదురుగా ఉన్న సత్య భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కంపెనీలోని ఉద్యోగులను అధికారులు బయటకు పంపించివేశారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు.

December 21, 2024 / 07:25 AM IST