WNP: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగ సందర్భంగా పట్టణ కేంద్రంలో పోచమ్మ తల్లిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి దర్శించుకున్నారు. చిన్నారెడ్డి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించారు.