BDK: భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. బాలిక అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసారు.