BDK: తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికులకు తీవ్ర గాయాలైన ఘటన అశ్వాపురం మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. రామచంద్రపురం గ్రామానికి చెందిన కొండా వీరయ్య అనే గీత కార్మికుడు ఈరోజు సాయంత్రం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గీత కార్మికుడు వీరయ్యను ఆసుపత్రికి తరలించారు.
మన్యం: కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందిన ఘటన జియ్యమ్మ వలస మండలం శిఖబడి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు వైకంటపు శ్రీను, సింహచలం అనే ఇద్దరు అన్నదమ్ములు మరో వాడిలో పొలం పని నిమిత్తం వెళ్లారు. పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న కూతురిపై తండ్రి కొంతకాలంగా అత్యాచారం చేస్తూ చిత్రహింసలకు గురిచేశాడు. బాధితురాలి నాయనమ్మ ఫిర్యాదు మేరకు తండ్రిపై పోక్సోకేసు నమోదు చేశారు పోలీసులు. చైతన్యపురిలోని సఖి సెంటర్‌కు బాధిత బాలికను తరలించారు.
KMM: ద్వారకా నగర్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో చోరీ కలకలం సృష్టించింది. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఓ దుండగుడు భారీగా నగదు, బంగారం అపహరించి నట్లు స్థానికులు చెప్పారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లో విషాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్లోని పాత పంచాయతీ కార్యాలయం సమీపంలో గోవిందు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
AP: పలాస పట్టణ టీడీపీ నేత హత్యకేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు బీహార్ గ్యాంగ్. మిగిలిన 10 మంది వైసీపీ నేతలు కాగా.. పరారీలో ఉన్నారని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. వారి దగ్గర నుంచి రెండు తుపాకులు, ఒక తపంచా, 40 బుల్లెట్లు, మూడు బైక్‌లు, కారు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. టీడీపీ నేత హత్యకు బీహార్ గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్ల...
GDWL: అలంపూర్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తి శనివారం హత్యకు గురయ్యాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎటువంటి బట్టలు లేకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు కర్నూలు ప్రాంతానికి చెందిన వాడై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
KMM: రఘునాథపాలెం మండలం కోయచలక క్రాస్ రోడ్డులోని ఇటుకలతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BDK: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎటపాక మండలానికి చెందిన సాయి చరణ్ బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి చరణ్ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఓ కారు ఎనిమిది పల్టీలు కొట్టిన ఘటన రాజస్థాన్‌లోని నాగౌర్‌లో చేటుచేసుకుంది. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కారు నుంచి బయటికి వచ్చిన వారంతా.. తాగడానికి టీ కావాలని అడిగినట్లు వెల్లడించారు.
TPT: తిరుపతి జిల్లా సత్యవేడు మండలం దాసుకుప్పం బృందావనంలో శనివారం స్పృహతప్పిన స్థితిలో వృద్ధుడు పడి ఉన్నాడు. వృద్ధుడికి నోటి మాట రావడం లేదు. బృందావనంలో పడి ఉన్నట్టు స్థానికులు గమనించారు. వృద్ధుడి నుంచి ఎటువంటి చలనం లేకపోవడం వల్ల మరో ఒకటి రెండు రోజుల్లోనే శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై అధికారుల స్పందించాలని కోరారు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు-బెంగళూరు జాతీయ రహదారిపై నెలమంగళ సమీపంలో కారుపై లారీ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతులు విజయపుర జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: సులభంగా డబ్బులు వస్తాయన్న ఆశతో సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రైవేట్ ఉద్యోగి రూ.1.33 లక్షలు పోగొట్టుకున్న ఘటన నేరేడ్మెట్లో జరిగింది. ఈ నెల 18న టెలిగ్రామ్‌లో ఒక సందేశం వచ్చింది. హోటల్స్, పబ్‌లకు రివ్యూ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో.. వివిధ రకాల రివ్యూలు ఇచ్చి 1.33 లక్షలు పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రకాశం: కంభం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. గుంటూరు ఆసుపత్రిలో ఓపీ తీసుకున్నట్లు ఆధారం తప్పా ఎటువంటి ఆధారాలు లభ్యం అవ్వలేదని రైల్వే సిబ్బంది తెలిపారు.