కోనసీమ: మాచవరం – రామచంద్రపురం రోడ్లో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు రాయవరం ఎస్సై సురేష్ బాబు తెలిపారు. ఎస్సై వివరాల మేరకు.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన శ్రీను బైక్‌పై వెళ్తుండగా సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న శ్రీను తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.