KRNL: సి. బెళగల్లో భారీ పేలుడు సంభవించింది. ఖాజా అనే రైతు తనపొలంలో ఉన్న రాతిగుండ్లు పెకలించే క్రమంలో కంప్రెసర్‌తో పేల్చడంతో ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు వీరాంజనేయులు, శ్రీరాములు, మద్దిలేటిగా గుర్తించారు. వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉంది.