CTR: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.