TPT: తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీ ఆఫ్ ఫిజియాలజీ ప్రొఫెసర్ ఉమా మహేశ్‌ను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ఓ విద్యార్థిని పట్ల లైంగిక వేధింపుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ రామచంద్ర రావు ఉత్తర్వులు జారి చేశారు.
KMR: మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి- కొమ్మలంచ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకు పై ఓ వ్యక్తి బాన్సువాడ వైపు నుంచి నిజాంసాగర్ వైపుగా వెళ్తుండగా తుంకిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు.అతనికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సహాయంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KMR: మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి- కొమ్మలంచ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకు పై ఓ వ్యక్తి బాన్సువాడ వైపు నుంచి నిజాంసాగర్ వైపుగా వెళ్తుండగా తుంకిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు.అతనికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సహాయంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KMR: మహమ్మద్ నగర్ మండలం తుంకి పల్లి- కొమ్మలంచ సమీపంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బైకు పై ఓ వ్యక్తి బాన్సువాడ వైపు నుంచి నిజాంసాగర్ వైపుగా వెళ్తుండగా తుంకిపల్లి సమీపంలో రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టాడు.అతనికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సహాయంతో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దక్షిణ కొరియాలోని ముయాన్ ఎయిర్ పోర్టులో జరిగిన విమాన ప్రమాదంలో మరో అంశం బయటకు వచ్చింది. రన్ వే చివర కాంక్రీట్ గోడ ఉండటం వల్లే అందరూ చనిపోయారని నిపుణులు అంటున్నారు. ఆ గోడ లేకపోతే.. కంచెను దాటుకొని విమానం సమీపంలోని పొలాల్లోకి వెళ్లి ఆగేదన్నారు. దీంతో అసలు ప్రాణ నష్టం ఉండేది కాదన్నారు. కాగా, రన్ వే చిన్నది కావడం వల్ల ప్రమాదం జరిగిందనే వార్తలను అధికారులు ఖండిస్తున్నారు.
SRCL: పట్టణంలోని రాజీవ్ నగర్‌కు చెందిన గుడ్ల కౌసల్య-రాజు దంపతులు సైకిల్‌పై వెళుతుండగా లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైనట్లు స్థానికులు తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణికి దరఖాస్తు చేసుకోవడానికి దంపతులు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
WNP: అమరచింత మండల పరిధిలోని మస్తీపూర్ గ్రామ శివారు మెయిన్ రోడ్డుపై రెండు బైకులు ఎదురుగా సోమవారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. చంద్ర గట్టు గ్రామానికి చెందిన నల్ల రెడ్డి(56) బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న నందిమల్ల గ్రామానికి చెందిన నాగరాజు(36) బైక్‌తో ఢీకొట్టింది. వారికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
కాకినాడ: పెద్దాపురం మండలంలోని చినబ్రహ్మదేవంలో సోమవారం కరెంట్ షాక్‌తో లారీ క్లీనర్ మృతి చెందారు. చేపల ట్రక్కులు లోడ్ చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ ఘటన చోటు చేసుకుందని పెద్దాపురం ఎస్సై మౌనిక సోమవారం తెలిపారు. ఈ ఘటనలో లారీ క్లీనర్ పెచ్చేటి నాగేశ్వరరావు (58) మృతి చెందాడు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇథియోపియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 71 మంది మరణించారు. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో కొందరు వివాహ వేడుకకి వెళ్లి తిరుగు పయనమైనట్లు చెప్పారు.
కామారెడ్డి: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహబూబ్ ఆదివారం రాత్రి మద్యం కోసం తండ్రి హైమద్(65)ను డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో గొంతు నులిమి చంపేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.
SRD: కంది మండలం ఉత్తరపల్లి గ్రామంలో సోమవారం వ్యక్తి దారుణ హత్య జరిగింది. గ్రామ శివారులోని పొలంలో యువకుని శవం కనిపించడంతో సంగారెడ్డి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలనికు చేరుకున్న సీఐ హత్యకు గురైన వ్యక్తిని పరిశీలించారు. మెడపై కత్తి గాట్లు ఉండడంతో హత్యగా నిర్ధారించారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సీఎం తెలిపారు.
CTR: సత్యవేడు మండల పరిధిలోని అలిమేలు మంగాపురం గ్రామ సమీపంలో గల చెరువు వద్ద బ్యాటరీ స్కూటీ అగ్నికి ఆహుతైన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అలిమేలు మంగాపురం గ్రామానికి చెందిన దేవసుందరం అనే వ్యక్తి తిరుపతిలో సోమవారం తెల్లవారుజామున స్వగ్రామం నుంచి సత్యవేడుకు వెళ్లే క్రమంలో ఉన్నట్టుండి స్కూటీ నుంచి పొగలు వచ్చాయి. ఈ మంటల్లో స్కూటీ మొత్తం దగ్దమైంది.
KMM: సత్తుపల్లి పట్టణంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్లెఓవర్ బ్రిడ్జ్‌పై వెళుతున్న కారు అదుపు తప్పి లైటింగ్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి సత్తుపల్లి మీదుగా వరంగల్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు క్లియర్ చేశారు.
SDPT: ములుగు మండలం దండిగూడెం గ్రామ శివారు పరిధిలో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి(పీటీ) గ్రామానికి చెందిన చెట్టి పృథ్వీరాజ్ కొండాపూర్ అనుమానస్పదంగా మృతి చెందాడు. రాత్రి 11 గంటల సమయంలో హత్య చేసి రోడ్డుపైన వేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
W.G: ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సుమారు 25 ఎకరాల ఎండు గడ్డికి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన ప్రాంతానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే ఎండుగడ్డి అగ్నికి ఆహుతైంది. నిప్పు పెట్టిన దుండగులను కఠినంగా శిక్షించి, రైతులకు ఆర్ధిన సహాయం చేయాలని కోరుతున్నారు.