MBNR: తొర్రూరు మండలం వెలికట్టే శివారులో మంగళవారం లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వెలికట్టే శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలో అక్రమంగా తరలిస్తున్న 18 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని, లారీని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశామన్నారు.