KKD: అచ్యుతాపురంలో ఈనెల 16న తల్లి షేక్ జహారా బీబీని హత్య చేసిన కొడుకు కమల్‌ను ఇంద్రపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. SI వీరబాబు వివరాల ప్రకారం.. బీటెక్ మధ్యలో ఆపేసి ఇంటి వద్ద రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న కొడుకును ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి అనడంతో నుదిటిపై బలంగా కొట్టి చంపాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.