KDP: ముద్దనూరు మండలం ఉప్పలూరులో జరిగిన కారు ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాలు మేరకు.. ఉప్పలూరుకి చెందిన గోవిందు కీర్తన (6) ఉప్పలూరులోని సచివాలయం వద్ద వారి బంధువుల శుభాకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డు దాటుతుండగా కారు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రి తరలించారు.