కాకినాడ: సామర్లకోట సమీపంలో రైలు నుంచి దిగుతూ ఒక యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి పెద్దాపురంకు చెందిన సిమ్ము సిరి త్రినాథ్ తల్లి విజయలక్ష్మిని విశాఖపట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు. నిద్రమత్తులో ఉన్న త్రినాథ్ రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించిన క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు.