NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లకు చెందిన దున్న ముత్యాలును తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు మంగళవారం దేవరకొండ నియోజకవర్గ ఇంఛార్జ్ ఎర్ర ఆంజనేయులు నియామక పత్రం అందజేశారు. పీఏపల్లి మండలంలో అంబేద్కర్ యువజన సంఘం బలోపేతానికి కృషి చేస్తానని సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తానని తెలిపారు.