SRPT: సూర్యాపేటలోని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, కౌన్సిలర్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పర్యావరణం కాపాడటంలో తమవంతు సహకారం అందిస్తామన్నారు.