ప్రకాశం: కొందరు వ్యక్తులు వికృతంగా వ్యవహరిస్తే డోంట్ టచ్ అంటూ తమను తాము కాపాడుకోవాలని కనిగిరి ఎస్సై శ్రీరామ్ సూచించారు. మంగళవారం కనిగిరిలోని హై స్కూల్లో బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే అంశంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా ఇబ్బందులు వుంటే 1098 నెంబర్కి ఫోన్ చేయాలని తెలిపారు.