GNTR: జిల్లాలో జీఎస్టీ వసూళ్లు మెరుగుపరిచేందుకు రిజిస్ట్రేషన్, రిటర్న్, కలెక్షన్స్‌కు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జీఎస్టీ, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో, పరిశ్రమలు, సేవా రంగాల్లో GST అధికారులు కోరిన సమాచారాన్ని వారంలో అందించాలని సూచించారు.