SKLM: కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలో గురువారం పట్టపగలే దొంగతనం జరిగింది. కృష్ణారావు కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి పనిమీద బయటికి వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి తాళం తెరచి ఉంది. బీరువాలోని 65 గ్రాముల బంగారం దొంగతనానికి గురైనట్లు గుర్తించి, పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.