ప్రకాశం: రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. టంగుటూరు మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన లక్కె పద్మ(47), ఆమె కుమార్తెలు లక్ష్మీ, మాధవిలు బొంతలు కుట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం వాళ్ళు ఆటోలో ఒంగోలు వెళ్తుండగా.. పెళ్లూరు వద్ద డివైడర్‌ని ఢీకొన్న ఓ కారు గాల్లో ఎగిరి ఆటోపై పడింది. ఘటనలో పద్మ స్పాట్ డెడ్ కాగా మిగిలిన వారికి తీవ్ర గాయలు అయ్యాయి.
AP: తూర్పు గోదావరి జిల్లా బూర్గుపూడి గేట్‌వద్ద రేవ్ పార్టీ కలకలం రేగింది. ఐదు మంది యువతులు, పది మంది యువకులతో పార్టీ చేస్తుండగా పోలీసులు దాడులు చేశారు. పార్టీలో ఉన్న వారిని కోరుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
E.G: దేవరపల్లి మండలంలోని డైమండ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి గుంటూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవే క్షతగ్రాతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
CTR: నడిచి వెళ్తున్న వృద్ధుడిని కారు ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం వద్ద సోమవారం చోటుచేసుకుంది. దుర్గసముద్రం గ్రామానికి చెందిన చెంగప్ప(60) దుర్గ సముద్రం మెయిన్ రోడ్డులో వెళ్తుండగా బండమీదపల్లె వైపు నుంచి వస్తున్న కారు ఢీకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో చంగప్ప అక్కడికక్కడే మృతి చెందాడు.
AP: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాడేరులో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై జి.మాడుగుల పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు జి.మాడుగుల మండలానికి చెందిన మల్లీశ్వరరావు, సన్యాసిరావుతోపాటు 16 ఏళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
WGL: నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో వివాహిత పిండి మానస (30) తన కూతురు సాత్విక(3)కు విషమిచ్చి తాను ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. కాగా మానసను కుటుంబీకులు చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో HYDకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మానస మరణించారు .పోలీసులు కేసు నమోదు చేశారు.
SKLM: సరుబుజ్జిలి మండలం జలుమూరు నుంచి అల్మండ వైపుగా ఐదు బోలెరల్లో గోవులు తరలిస్తుండగా ఆదివారం రాత్రి స్థానికులు గమనించి మూడు బోలెరాలను పట్టుకున్నారు. ఈ మేరకు 21 గోవులను స్వాధీనం చేసుకుని, స్థానిక సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. రెండు బోలెరాలు తప్పించుకున్నాయని స్థానికులు పోలీసులకు తెలిపారు.
SKLM: పలాస మండలం రంగోయి జంక్షన్ సమీప జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పోతయ్య (57) రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో పోతయ్య తీవ్ర గాయాల పాలయ్యాడు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ, తాలిబన్లు పరస్పర దాడులు చేసుకున్నారు. కుర్రం, నార్త్ వజీరిస్తాన్ ప్రాంతంలో పాక్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 20 మంది తాలిబన్లు మరణించారు. అలాగే.. 6 తాలిబన్ పోస్టులు ధ్వంసం చేశారు. మరో 40 పోస్టులు స్వాధీనం చేసుకున్నారు.
SKLM: భామిని మండలం స్థానిక ఎయిర్టెల్ టవర్‌లో విడిభాగాలు దొంగలించడానికి దొంగలు ప్రయత్నం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్టెల్ సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం.. శనివారం రాత్రి, టవర్‌కు పవర్ కట్ చేశారని, సిబ్బంది ఎలర్ట్ అయ్యి ముందు స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ సమాచారం తెలుపగా, దొంగలు పరారైనట్లు తెలిపారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలం మెట్టు వద్ద స్వర్ణముఖి నది దాటుతూ ఒకరు గల్లంతాయ్యారు. కోట మండలం రుద్రవరానికి చెందిన నాగూరయ్య (45) పశువుల కోసం వెళ్లారు. నది అవతల ఒడ్డు నుంచి ఇవతలకు పశువులను తోలే క్రమంలో ఆయన నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
CTR: కంటైనర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పూతలపట్టు సీఐ కృష్ణ మనోహర్ సమాచారం మేరకు.. పాకాల మండలం చిన్నప్పగారిపల్లికి చెందిన శేఖర్ యాదవ్ భార్య రూప(27) ఓ ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తుంది. విధులు ముగించుకొని పి.కొత్తకోట PHC వద్ద రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొని మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోనసీమ: పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ఐదుగురిని తీవ్రంగా గాయపరిచింది. అంబాజీపేట మండలం ఇసుకపూడిలో చింతా వాసు, పళ్ళ స్వామినాయుడుతో పాటు మరో ముగ్గురిని ఆదివారం సాయంత్రం పిచ్చికుక్క తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రులను అమలాపురం ఆసుపత్రికి తరలించారు. పంచాయతీ సిబ్బంది స్పందించి గ్రామంలో కుక్కల నియంత్రణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
CTR: చౌడేపల్లి బోయకొండ మార్గంలోని చిన్న కొండా మారి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. చౌడేపల్లి నుంచి బోయకొండ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో భార్యా భర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 సహాయంతో మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.
W.G: దేవరపల్లి మండలంలోని డైమండ్ జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున తృటిలో పెను ప్రమాదం తప్పింది. వైజాగ్ నుంచి గుంటూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్‌లో క్షతగ్రాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.