సత్యసాయి: పరిగి మండలం జయమంగలి నదిలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన జగదీష్ (27) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడి సమీపంలో కూల్ డ్రింక్ బాటిల్, పురుగుల మందు బాటిల్ లభించాయి. పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమికంగా నిర్థారించారు. పరిగి ఎస్సై రంగడు యాదవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.