WGL: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఇవాళ సంగెం మండలంలోని ఆశాలపల్లిలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజమహకూర్ తన కుటుంబంతో కలిసి మూడు నెలలుగా ఆశాలపల్లి శివారులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్నాడు. వారి ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడిపోయింది. వేంటనే MGM ఆసుపత్రికి తరలించినా, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.